వరుస దొంగతనాలు అనంతపురం వాసులను భయపెడుతున్నాయి. నాలుగు రోజుల కిందట అనంతపురం గ్రామీణ మండలంలో నాలుగు దుకాణాల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనను మరువక ముందే తాజాగా.. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేడీస్ హాస్టల్‌లోకి ఓ దొంగ ప్రవేశించాడు. రాత్రి వేళ లేడీస్ హాస్టల్‌లోకి దూరిన దొంగ.. రిసెప్షన్ వద్ద ఉన్న నగదు ఎత్తుకెళ్లాడు. ఉదయాన్నే చోరీ జరిగిన విషయం గుర్తించిన హాస్టల్ నిర్వాహకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు నమోదుకాగా.. వీటి ఆధారంగా దుండగుణ్ని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.