అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను హత్య చేసి.. ఇంటి ముందు పాతిపెట్టిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల కిందట జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితురాలు, తన కుమార్తెతో గొడవపడటంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితురాలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.