Hindupur Robbery Gang Arrest: రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కూల్ డ్రింక్‌లలో మత్తుమందు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్నారు. యూపీకి చెందిన దొంగల ముఠా రైళ్లలోని ప్రయాణికులతో పరిచయం పెంచుకుంటారు.ఆ తర్వాత పుట్టినరోజు అని లేదా ఉద్యోగం వచ్చిందని నిందితులు చెబుతారు. ఆ తర్వాత ముందుగా మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ప్రయాణికులకు ఇస్తారు. అనంతరం వారు మత్తులోకి జారుకున్నాక ప్రయాణికుల దగ్గర ఉన్న విలువైన వస్తువులతో పారిపోతారు.