Anantapur Auto Driver Saves Young Man With CPR: అనంతపురం జిల్లాలో ఒక ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు.. ఉరవకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయిన యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆమిద్యాలకి చెందిన సిద్దు, చిన్నా బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి సిద్దుకు సీపీఆర్ చేశారు. సిద్దును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతనికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. చంద్రశేఖర్ సకాలంలో స్పందించినందుకు అందరూ అభినందించారు.