Andhra Pradesh Man To Marries Two Women: ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ఆగిపోయింది. శ్రీసత్యసాయి జిల్లాలో జరగాల్సిన ఈ పెళ్లిలో వరుడు ఇద్దరమ్మాయిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి పెళ్లిని ఆపేశారు. బాలికల వయస్సు 16, 15 సంవత్సరాలు కావడంతో ఈ చర్య తీసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోగా.. కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.