అనకాపల్లి జిల్లాలో జరిగిన హిజ్రా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం బయ్యవరంలో రోడ్డు పక్కన దుప్పటిలో శరీర భాగాలు కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనకు కారణాలను కనిపెట్టారు. చనిపోయింది ఓ ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించిన పోలీసులు.. హిజ్రాతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం .