Fire Accident Anakapalle: అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలంలోని కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. మరోవైపు పేలుడు ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు.