Paravada Gas Leaked In Pharma City: అనకాపల్లి జిల్లా పరవాడలోని నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకైంది. రక్షిత్ డ్రగ్స్ ఫార్మా కంపెనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ పీపీ బ్లాక్‌లోని సెంట్రింగ్ పాయింట్ వద్ద విష వాయువు లీక్ కాగా.. విధుల్లో ఉన్న ఇద్దరు ఒడిశా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.