Anna Canteens First Day Food: కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీల పరిధిలో 99 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గుంటూరు నగరం పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి పాతబస్టాండు సెంటర్లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తొలి రోజు అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు.