Krishna District Collector Eat Food In Anna Canteen: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడు స్తంభాల సెంటర్ దగ్గర అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ బాలాజీ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆయన సతీమణి, తండ్రితో కలిసి అక్కడికి వెళ్లారు.. భోజనం రుచి చేశారు. అన్న క్యాంటీన్లలో భోజనం రుచిగా ఉందని కలెక్టర్ ప్రశంసించారు.. కొన్ని సూచనలు కూాడా చేశారు. ఆయన కూడా సామాన్యుడిగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకోవడం విశేషం.