Trust Donated Land For Anna Canteens Kitchen: ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.. తొలి విడతలో మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభించారు. అలాగే మిగిలిన క్యాంటీన్లను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లకు ఆహారం అందిస్తోంది. అయితే అన్న క్యాంటీన్ల కోసం పలువురు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి మెమోరియల్ ట్రస్టు అన్న క్యాంటీన్ కిచెన్ కోసం మూడెకరాల స్థలంలో కిచెన్‌ను సమకూర్చింది.