Celkon CMD Guruswamy Naidu meets Chandrababu and donates for Anna canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందింది. సెల్‌కాన్ సీఎండీ అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పెద్దమొత్తంలో విరాళం అందించారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని సెల్‌కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు.. అన్న క్యాంటీన్ల కోసం 26 లక్షల 25 వేల రూపాయలను విరాళంగా అందించారు. అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు భోజనం అందించేందుకు ఈ మొత్తం ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో రూ.26.25 లక్షల విరాళం తాలూకు చెక్‌ను గురుస్వామి నాయుడు.. సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు.