Sistla Lohit Donates Rs 1 Crore: అన్న క్యాంటీన్ల నిర్వహణకు పారిశ్రామిక వేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ రూ.కోటి విరాళం అందజేశారు. విరాళం చెక్కును విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఇచ్చారు. లోహిత్‌ను లోకేష్ అభినందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌ల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు లోహిత్ తెలిపారు. అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందజేసిన సంగతి తెలిసిందే.