రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పుంగనూరు ఆరేళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని తేలింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియా సమావేశంలో వెల్లడించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజే హత్య చేశారని.. ఆ తర్వాత బైక్ మీద తీసుకువచ్చి పుంగనూరు సమ్మర్ స్టోరేజీలో పడేసినట్లు వివరించారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.