జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా జూలు విధిలిస్తోంది. చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే లెక్కచేయకు వాటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఇప్పటికే అనేక కట్టడాలు నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేసింది.