అన్నదాత సుఖీభవ రావాలంటే ఈ పనిచేయాల్సిందే.. జూన్ 20 చివరి తేదీ.. రైతులారా త్వరపడండి..

9 months ago 18
ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారమే జూన్ 20వ తేదీ అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ యోజన రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కలిపి తొలివిడతగా అన్నదాత సుఖీభవ కింద రూ.7000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఇందుకు బయోమెట్రిక్ ఈ కేవైసీ తప్పనిసరి కాగా.. ఈ కేవైసీ నమోదుకు జూన్ 20వ తేదీనే ఆఖరి తేదీ అని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article