అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణికులపై బూతులతో రెచ్పిపోయారు. తన సీటులో కూర్చున్నారనే కోపంతో ప్రయాణికులపై మండిపడ్డారు. బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఓ వృద్ధురాలిని కండక్టర్ సీట్‌లో కూర్చోమని ఓ ప్రయాణికుడు సూచించటమే కండక్టర్ కోపానికి కారణమైంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.