బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లను మహిళలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలుగా ఉండగా.. లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.