Rayachoti Gas Cylinder Blast: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయచోటి తొగటవీధిలో జరిగిన ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. తొగట వీధిలోని మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో తల్లి, కుమారుడు, కుమార్తెలకు మంటలు అంటుకుని చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. మృతులు రమాదేవి, మనోహర్, మన్వితగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.