అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ.. సస్పెండ్ చేసిన అధికారులు!

1 year ago 27
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఏ.రాజశేఖర్ బాబు అనే అధికారి అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్నందుకు సస్పెండ్ అయ్యారు. పుత్తూరులోని చర్చిలో ఆయన ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. ఆయన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ అధికారిక నోట్‌ను కూడా రిలీజ్ చేశారు.
Read Entire Article