భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వరంగల్, భోగాపురం ఎయిర్‌పోర్టుల విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో 50 కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీలో నూతన ఎయిర్‌పోర్టులపై దృష్టిపెట్టినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.