HYDRA Demolitions: హైదరాబాద్‌లో అగ్గిరాజేస్తో్న్న హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మరోసారి స్పందించారు. అయితే.. హైడ్రా కూల్చివేతలపై మొదట్లో స్పందించిన కేఏ పాల్.. అభినందించారు. నాగార్జున లాంటి పెద్ద హీరోల నిర్మాణాలు కూడా కూల్చివేయటాన్ని అభినందించిన పాల్.. ఏపీలోనూ అలాంటి సంస్థ తీసుకురావాలన్నారు. అయితే.. అదే హైడ్రాపై ఇప్పుడు కేఏ పాల్ స్వరం మార్చారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపేయాలంటూ ఇంకో వీడియో విడుదల చేశారు.