హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో ఒకసారి ప్రభాకర్ రెడ్డిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసి మోసం చేశాడని ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.