కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లగచర్ల దాడి ఘటనపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద సెటైర్లు వేశారు. వికారాబాద్ కలెక్టర్ దాడిపై స్పందించిన బండి సంజయ్.. అది దారుణమైన చర్యగా అభివర్ణించారు. అయితే.. కలెక్టర్ మీద దాడి చేసింది రైతులు కాదనీ.. దాడి వెనుక కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పినట్టుగా గుర్తు చేశారు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నటసార్వభౌముడని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ని కలిశారంటూ కీలక ఆరోపణలు చేశారు.