సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు, కుమారుడు అకీరా నందన్‌తో పాటుగా కేరళ వెళ్లిన పవన్ కళ్యాణ్.. కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. పవన్ కళ్యాణ్ వెంట టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు.