అమరావతిలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. ముఖ్యంగా రాజధానికి కనెక్టివిటీని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు పనుల్ని వేగవంతం చేస్తున్నారు. దాదాపు 190 కిలోమీటర్లు, 70 మీటర్ల వెడల్పుతో ఆరు వరసలతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దేశంలోనే అతిపెద్ద ఓఆర్‌ఆర్‌గా నిలస్తుందని చెబుతున్నారు. అయితే, గతంలో ఓఆర్ఆర్ వెడల్పును 150 మీటర్లకు అనుమతించాలని, ఇందుకు అనుగుణంగా భూసేకరణకు ఆమోదం తెలపాలని కోరింది.