Chandrababu On Amaravati R5 Problem: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్-5 జోన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం చూపారు. కలెక్టర్ల సదస్సులో సీఆర్‌డీఏ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఈ మేరకు నిర్దేశించారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించేలా.. గుంటూరు, కృష్ణా జిల్లాలు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్5 జోన్ సమస్యకు పరిష్కారం చూపించారు.