ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తూనే.. భవిష్యత్తు విస్తరణ కోసం మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని యోచిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, రింగ్ రోడ్ల అనుసంధానం కోసం కోర్ క్యాపిటల్ పరిసర గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే రూ. 31 వేల కోట్ల పనులు వివిధ ఏజెన్సీలకు అప్పగించగా.. భవిష్యత్ అవసరాల కోసం భూమిని సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నో-ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించారు.