Chandrababu Naidu Restarts Amaravati Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. అమరావతిలోని సీఆర్డీఏ బిల్డింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ప్రారంభించారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు చంద్రబాబు. అమరావతికి గత వైభవం వస్తుందని.. పనుల్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. రాజధానికి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు.