అమ్మమ్మ నుంచి అమ్మకు.. అమ్మ నుంచి కొడుకులకు అనువంశికంగా సంక్రమించే అత్యంత అరుదైన గుండె సమస్యకు హైదరాబాద్ కామినేని హాస్పిటల్ వైద్యులు.. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. గుండెలోని ప్రధాన రక్తనాళమైన బృహద్ధమనిని మార్చేసి.. కృత్రిమ బృహద్ధమని అమర్చి తల్లీ కుమారుల ప్రాణాలు కాపాడారు. ఇప్పటివరకు కామినేని ఆస్పత్రిలో 13 శస్త్రచికిత్సలు ఇలాంటివి నిర్వహించగా.. అన్నీ విజయవంతం అయినట్టు వైద్యులు ప్రకటించారు.