Hyderabad Bonalu Festival: వేడుకలు, ఉత్సవాలు, దేవాలయాలు ఇలా సందర్భం ఏదైనా.. ఖైరతాబాద్ గణేషుడైనా, అమ్మవారి ఆలయాలైనా.. మహిళలకు ఆకతాయిల బెడద తప్పట్లేదు. పవిత్రమైన గుళ్లలో కూడా అమ్మాయిలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై హైదరాబాద్ పోలీసులు డేగ కన్ను వేశారు. బోనాల వేడుకల్లో.. మహిళలను అసభ్యకరంగా తాకుతూ శునకానందం పొందే ప్రబుద్ధులను షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 305 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకోవటం గమనార్హం.