అమ్మాయి రమ్మని పిలిచిందని ఎంతో హుషారుగా.. కొత్త బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని వెళ్లాడు. ఇద్దరు కలిసి ఏకాంతంగా కారులో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నలుగురు బైకుల మీద వచ్చి.. అమ్మాయితో ఏం చేస్తున్నావ్.. ఎక్కడికి తీసుకెళ్తున్నావని బెదిరించారు. పలు ప్రాంతాల్లో తిప్పుతూ.. ఆగం చేశారు. ఈ క్రమంలోనే.. అకౌంట్‌లో ఉన్న నగదులు.. యూపీఐ ద్వారా పంపించుకుని.. ఓ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడు కానీ అతనికి అసలు విషయం అర్థం కాలేదు.