విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణ ఘటన జరిగింది. తమ అమ్మాయిని వీడియో తీశాడనే కారణంతో ఓ యువకుడిని ఆమె కుటుంబసభ్యులు ఇంట్లో బంధించారు. మీ అమ్మానాన్నకు చెప్తామంటూ బెదిరించారు. మీ వాడి నిర్వాకం ఇదంటూ అతని తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని చూసేసరికి సదరు యువకుడు.. ఉరేసుకుని కనిపించాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. గాజువాకలోని శ్రీరాంనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.