Araku Hot Balloon Ride: అరకులో పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మాపురం గార్డెన్, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్‌ను ఐటీడీఏ ఆధ్వర్యంలో అందుబాటులో తెచ్చేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. అరకు లోయ పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ట్రయల్ రన్ నిర్వహించారు. హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్‌లను నెలన్నర రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వీటి టికెట్ ధరలను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.