Kaushik Reddy Calls For Brs Protest Today: తెలంగాణలో ఫిరాయింపులపై పొలిటికల్ హీట్ పెరిగింది. రెండు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, శెరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే గాంధీ కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.. ఈ క్రమంలో హైడ్రామా నడిచింది.. దీంతో గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇవాళ గాంధీ ఇంటికి వెళతామని ప్రకటించారు.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.