తెలంగాణ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు పర్యాటక శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 4 రోజుల పర్యటనకు గానూ.. తెలంగాణ టూరిజం శాఖ.. అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. నాలుగు రోజుల్లో.. కాణిపాకం, అరుణాచలం, వేలూరు ఇలా నాలుగు రోజుల ఆధ్యాత్మిక పర్యటనకు ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. ఈ ప్యాకేజీ నెలలో కేవలం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండనుంది.