నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్హత లేకున్నా కంటి వైద్యం చేస్తున్న ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. డిగ్రీ విద్యార్హత కూడా లేకున్న వైద్యం చేస్తూ.. ఓ మహిళ చూపు కోల్పోయేందుకు కారణమైన వికాస్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ఫేక్ డాక్టర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.