హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ తనదేనని.. అది బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కేటీఆర్.. కీలక కామెంట్లు చేశారు. తనకు సొంతంగా ఎలాంటి ఫాంహౌస్ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తన స్నేహితుని ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్నానని.. ఒకవేళ అది బఫర్ జోన్‌లో ఉంటే.. తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రైతు రుణమాఫీ అంశంపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.