Andhra Pradesh Government On Ys Jagan Security: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తనకు ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్నట్లుగా భద్రతను కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జగన్ భద్రతపై ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించింది. నిబంధనలకు తగిన విధంగానే సెక్యూరిటీని కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి భద్రత కల్పించారో.. ఇప్పుడు జగన్‌కు అదే భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.