ఏపీలో ప్రభుత్వం అందించే అదనపు సాయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు అదనపు సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అదనపు సాయం పొందిన తర్వాత కూడా నిర్మాణం మొదలుపెట్టని వారికి ఏపీ గృహ నిర్మాణ శాఖ నోటీసులు జారీచేసేందుకు సిద్ధమైంది. అదనపు సాయం పొందినవారు పనులు వెంటనే ప్రారంభించాలని.. లేకపోతే ఇంటి స్థలం వేరే వారికి కేటాయిస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.