మంచు మోహన్ బాబు కుటుంబ గొడవ రచ్చకెక్కింది. గత రెండు రోజులుగా గొడవ జరుగుతుండగా.. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలతో పాటు పలువురు ఖండిస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎంపీ రఘనందన్ రావు సైతం స్పందించారు.