రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రేషన్ డీలర్లపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.