చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఆమె ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రంగరాజన్‌పై దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని.. తమ నమ్మకాలను ఇతరులపై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేననిఅన్నారు. దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.