బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని అన్నారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.