హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఈ విషయం తెలిసి బాధకలుగుతోందన్న లక్ష్మీపార్వతి.. చేయని తప్పునకు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్పందన తెలుసుకోవడానికి అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వెళ్లారని లక్ష్మీపార్వతి చెప్పారు. ఇక పుష్కరాల సమయంలో, ఎన్నికల ప్రచారంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. ప్రతిచోటా చంద్రబాబు హస్తం ఉంటుందంటూ లక్ష్మీపార్వతి అనుమానం వ్యక్తం చేశారు.