హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం దాడి జరిగిన సంగతి తేలింది. ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంట్లోని పూల కుండీలు ధ్వసం చేశారు. రేవతికి న్యాయం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురుని అదుపులోకి తీసుకొని కేసులు పెట్టారు. వీరికి తాజాగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లోగా పూచీకత్తులను సమర్పించాలని స్పష్టం చేసింది.