పుష్ప 2 సినిమాతో భారీ విజయం సాధించిన, దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యారని.. ఆయనకు ప్రశాంత్ కిశోర్ పలు సూచనలు చేశారని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ వార్తలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఆ వివరాలు..