పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్.. అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. తొక్కిసలాట ఘటన బాధాకరమని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే బెనిఫిట్ షోల రద్దు ఆలోచన సరికాదన్న పల్లా శ్రీనివాసరావు.. అలాంటి సమయాల్లో ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే సినిమా నటులు కూడా బెనిఫిట్ షోలకు వెళ్లకపోవటమే మంచిదని అభిప్రాయపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటన వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉన్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.