వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి చేరతారనేదీ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్‌కు ఓ పార్టీ నేత స్వాగతం పలికారు. అవంతి శ్రీనివాస్ బీజేపీలోకి వస్తామంటే స్వాగతిస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేయటంతో.. అవంతి శ్రీనివాస్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది.