వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా సెల్వమణి.. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తన పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారన్న రోజా.. తనకు ఎలాంటి యూట్యూబ్ ఛానెల్ లేదని తెలిపారు. ఫేక్ యూట్యూ్బ్ ఛానెల్ నడుపుతున్న వారు వెంటనే అకౌంట్లు డిలీట్ చేయాలని.. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఆర్కే రోజా యూట్యూబ్ ఛానెల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ కొన్ని స్క్రీన్ షాట్లు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజా కీలక ప్రకటన చేశారు.